క్యాప్సికం బాంబే చట్నీ

సోమవారం, 17 మార్చి 2008 (13:03 IST)
కావలసిన పదార్థాలు :
క్యాప్సికమ్ - పావు కిలో, కొబ్బరి తురుము - అర కప్పు, పచ్చిమిర్చి - నాలుగు (పొడుగ్గా తరిగినవి), కొత్తిమీర - కాస్త, ఆవాలు - స్పూన్, జీలకర్ర - స్పూన్, పసుపు - పావు టీస్పూన్, శెనగపిండి - రెండు టీ స్పూన్లు, నిమ్మకాయ రసం - రెండు టీస్పూన్లు, ఉప్పు - తగినంత, నూనె - కాస్త.

తయారు చేయు విధానం :
ముందుగా బాణాలిలో నూనె వేసి కాగాక అందులో శెనగపిండి వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో కాస్త నూనె వేసి ఆవాలను పోపు పెట్టి ఇందులో పచ్చిమిర్చిని వేశాక, పసుపు, ఉప్పులను కూడా వేసి వేయించాలి. తర్వాత తరిగిన క్యాప్సికమ్ ముక్కలను వేయాలి.

దీనిలో అర కప్పు నీళ్లు పోసి బాగా తిప్పి మూత పెట్టి ఉడికించాలి. జీలకర్ర పొడి, కోరిన కొబ్బరి, వేయించిన శెనగపిండిలను వేసి కాసేపు ఉంచాలి. చివరగా దీనిలో నిమ్మరసం వేసి, కొత్తిమీరను జల్లి సర్వ్ చేయాలి.

వెబ్దునియా పై చదవండి