కావలసిన పదార్థాలు : క్యాబేజీ... 50 గ్రాములు నూనె... 100 గ్రాములు ఎండుమిర్చి... 10 చింతపండు... నిమ్మకాయంత ఇంగువముక్క... చిన్నముక్క పోపులు, పసుపు... సరిపడా ఉప్పు... సరిపడా
తయారీ విధానం : కాస్తంత నూనెలో ఎండుమిర్చి వేయించి పక్కన పెట్టుకోవాలి. తరిగి ఉంచుకున్న క్యాబేజీని మరికాస్త నూనె వేసి వేయించాలి. అందులోనే చింతపండు రసం పోసి, పసుపువేసి బాగా కలియబెట్టి కాసిన్ని నీళ్ళు పోసి, మూతపెట్టి ఉడికించాలి. నీళ్ళన్నీ ఇగిరిపోయి క్యాబేజీ బాగా ఉడికిన తరువాత దాన్ని దించి చల్లారబెట్టాలి.