కావలసిన పదార్థాలు : బంగాళాదుంపలు.. అర కేజీ మిరియాలపొడి.. అర టీ. దాల్చినచెక్క.. అర టీ. సోంపు.. ఒక టీ. నూనె.. తగినంత కొత్తిమీర.. 2 కట్టలు పచ్చిమిర్చి.. 6 అల్లం.. కాస్తంత నిమ్మకాయ.. ఒకటి ఇంగువ.. చిటికెడు కొబ్బరితురుము.. పావు కప్పు లవంగాలు.. 5 నువ్వులు.. 1 టీ. పంచదార.. 2 టీ. ఉప్ప.. తగినంత శెనగపిండి.. 75 గ్రా. గోధుమపిండి.. పావు కేజీ
తయారీ విధానం : బంగాళాదుంపల తొక్కుతీసి కట్ చేసుకోవాలి. నూనె వేడిచేసి ఇంగువ వేసి బంగాళాదుంప ముక్కలు వేసి ఉడికించాలి. వాటిని చల్లార్చి సోంపు, పంచదార, ఉప్పు, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాలపొడి, దాల్చిన చెక్కపొడి, నిమ్మరసం, కొబ్బరి తురుము, లవంగాలు, నువ్వులు వేసి కలిపి ముద్దలా చేసి పక్కన ఉంచాలి.
శెనగపిండి, గోధుమపిండిలను కలిపి, రెండు టీస్పూన్ల నూనె, తగినన్ని నీళ్లు పోసి గట్టి ముద్దలా చేయాలి. దీనిని రెండు సమాన భాగాలుగా చేసి.. చపాతీల్లాగా వత్తాలి. ఈ చపాతీల మీద బంగాళాదుంప మిశ్రమాన్ని పరచి చాపలా చుట్టి, అంచుల్ని తడిచేసి అతికించాలి. వీటిని ముక్కలుగా కోసి నూనె నూనెలో వేయిస్తే బఖార్ పడీ సిద్ధమైనట్లే..!