చెన్నయ్ 'ది రెసిడెన్సీ'లో కాఫీ షాపు ప్రారంభం!

WD
WD
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్‌లోని ఐదు నక్షత్రాల హోటళ్ళలో ఒకటైన ది రెసిడెన్సీలో ప్రత్యేకంగా ఓ కాఫీ షాపును ప్రారంభించారు. ప్రముఖ తమిళ నటుడు ఆర్.పార్తీపన్ చేతుల మీదుగా ఈ కాఫీ షాపు ప్రారంభానికి నోచుకుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉత్తర, దక్షిణ భారతీయులను ఇట్టే ఆకర్షించే విధంగా దీన్ని రూపొందించారు. 24 గంటల పాటు ఈ షాపు ఉంటుంది.

1991లో ప్రారంభమైన ఈ నక్షత్ర హోటల్‌ గత 18 సంవత్సరాలుగా స్వదేశీ, విదేశీ వాసుల అభిరుచికి తగ్గట్టుగా వంటకాలను తయారు చేస్తూ ఇట్టే ఆకర్షిస్తోంది. బిజినెస్ క్లాస్ హోటల్ గ్రూపునకు చెందిన ఈ నక్షత్ర హోటల్ నాలుగు సార్లు ఉత్తమ హోటల్ అవార్డును అందుకుంది.

మొత్తం సెంట్రల్ ఎయిర్ కండీషన్ సౌకర్యం కలిగిన ఈ హోటల్‌లో రెండు రెస్టారెంట్లు స్పైస్ జార్, చిన్ అండ్ చిన్, ఒక రెస్టోబార్ బ్లాక్ అండ్ వైట్ ఉండగా, తాజాగా కాఫీషాపును నటుడు పార్తీపన్ ప్రారంభించారు.

వెబ్దునియా పై చదవండి