"జాగీర్ దుంపలు" ఎవరికైనా నోరూరాల్సిందే..!!

FILE
కావలసిన పదార్థాలు :
చిలగడ దుంపలు.. అర కేజీ
యాలక్కాయలు.. 5 గ్రా.
బెల్లం.. అర కేజీ
నెయ్యి.. 50 గ్రా.

తయారీ విధానం :
ఎర్ర చిలగడ దుంపలు తీసుకుని శుభ్రంగా కడిగి.. గుండ్రంగా కోసి.. దళసరి మందం ఉండే గిన్నెలో వేయాలి. బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి దుంపలుండే గిన్నెలోనే వేయాలి. దీంట్లో ఒక కప్పు నీరు పోసి ఉడికించాలి. ముక్కలు ఉడికి బాగా మెత్తబడి.. పాకం దగ్గర పడుతుండగా యాలకుల పొడి, నెయ్యి కలిపి మరో ఐదు నిమిషాలపాటు ఉడికించి దించేయాలి. అంతే జాగీర్ దుంపలు రెడీ. మంచి పోషకాలుండే ఈ జాగీర్ దుంపలు పదార్థాన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పెద్దలకు కూడా బాగా నచ్చుతుంది.

వెబ్దునియా పై చదవండి