పాలతో ముల్లంగి కూర

మంగళవారం, 29 జులై 2008 (19:39 IST)
కావలసిన పదార్థాలు :
ముల్లంగి... రెండు
ఉల్లిపాయలు... రెండు
పచ్చిమిర్చి... రెండు
ఉప్పు... సరిపడా
పసుపు... చిటికెడు
కారం... సరిపడా
మసాలాపొడి... అరటీస్పూను
అల్లం, వెల్లుల్లి ముద్ద... ఒక టీస్పూను
పాలు... ఒక కప్పు
నూనె... సరిపడా

తయారీ విధానం :
ముల్లంగి దుంపలను శుభ్రంగా కడిగి సన్నగా ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. ఆ తరువాత ఉల్లిపాయలు, పచ్చి మిర్చిని కూడా తరిగి ఉంచుకోవాలి. బాణలిలో నూనె వేసి, మరిగిన తరువాత ఉల్లిపాయలు, పచ్చి మిర్చి ముక్కలు వేయించి అందులోనే అల్లం, వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి.

తరువాత ముల్లంగి ముక్కలు, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి సన్నిటి సెగపైన మూతపెట్టి ఉడికించాలి. అటుపైన కారం, మసాలా పొడులను వేసి కలియబెట్టి కొంచెం సేపు ఉడికిన తరువాత, చివర్లో పాలు పోసి ఉడికించి కూర చిక్కబడుతున్నప్పుడు దించి సర్వ్ చేయాలి.

వెబ్దునియా పై చదవండి