బెల్లంతో దొండకాయ కరీ

సోమవారం, 17 మార్చి 2008 (13:04 IST)
కావలసిన పదార్థాలు :
దొండకాయలు - అరకిలో, చింతపండు రసం - ఐదు చెంచాలు, బెల్లం పొడి - ఐదు చెంచాలు, పసుపు - చెంచా, ఉప్పు - తగినంత. తిరగమాతకి కావలసినవి : మినపప్పు - చెంచా, ఆవాలు - అర చెంచా, ఎండు మిర్చి - మూడు, నూనె - మూడు చెంచాలు.

తయారు చేయు విధానం :
ముందుగా దొండకాయలను శుభ్రంగా కడిగి సన్నాగ తరిగి పెట్టుకోవాలి. ఇందులో పసుపు, ఉప్పు, చింతపండు రసాలను వేసి ఉడికించాలి. తర్వాత బాణాలి పెట్టి అందులో నూనె వేసి కాగాక, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చిలను వేసి వేయించాలి. ఉడికించిన దొండకాయలను తీసి ఇందులో వేసి బెల్లంపొడిని కూడా వేయాలి. బెల్లం పాకంగా మారడంతో అది ఇంకిపోయే వరకు సన్నని సెగపై ఉంచి దించాలి.

వెబ్దునియా పై చదవండి