బేబీ పొటాటోలతో "మొఘలాయి కుర్మా"

FILE
కావలసిన పదార్థాలు :
బేబీ పొటాటోస్.. అర కేజీ
పెరుగు.. పావు కేజీ
ఉల్లిపాయలు.. నాలుగు
బఠాణీలు.. పావు కేజీ
టమోటోలు.. మూడు
గరంమసాలా.. కాస్తంత
ఉప్పు, నూనె.. తగినంత

తయారీ విధానం :
బేబీ పొటాటోస్‌ను ఉడికించి తోలు వలిచి పక్కన పెట్టాలి. ఫోర్క్‌తో వాటికి చిన్నగా రంధ్రాలు చేసి వాటిని పెరుగులో నానబెట్టాలి. ఉల్లిపాయల్ని సన్నని నిలువు ముక్కలుగా తరిగి ఉంచాలి. టమోటో, పచ్చిమిర్చిలను కూడా సన్నని ముక్కలుగా తరగాలి. బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి, మీడియం మంటమీద ఉల్లిముక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి.

ఇప్పుడు దీనికి బఠాణీలను కూడా చేర్చి.. పసుపు, ఉప్పు, కారం, టమోటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలియబెట్టాలి. దీనికి మూతపెట్టి గ్రేవీ వచ్చేదాకా ఉడికించాలి. చివరగా పెరుగులో నానబెట్టిన బేబీ పొటాటోస్‌ను కూడా వేసి 5 నిమిషాలసేపు బాగా మగ్గించాలి. చివర్లో గరంమసాలా వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించి దించేముందు కొద్దిగా క్రీము, తరిగిన కొత్తిమీరతో డెకరేట్ చేసి వడ్డించాలి.

వెబ్దునియా పై చదవండి