కావలసిన పదార్థాలు : రికోట్టా చీజ్... పావు కేజీ పనీర్... పావుకేజీ పెరుగు... 50 గ్రాములు అల్లం, వెల్లుల్లి పేస్ట్... రెండు టీస్పూన్లు మస్టర్డ్ ఆయిల్... రెండు టీస్పూన్లు ఉప్పు... తగినంత పచ్చిమిరపకాయల పేస్ట్... రెండు టీస్పూన్లు నిమ్మరసం... రెండు టీస్పూన్లు ధనియాల పొడి... ఒక టీస్పూన్ జీడిపప్పు పొడి... రెండు టీస్పూన్లు ఛాట్ మసాలా... ఒక టీస్పూన్ తరిగిన పుదీనా, కొత్తిమీర... రెండు టీస్పూన్లు క్యాప్సికం... ఒకటి టొమోటో... ఒకటి బంగాళాదుంప... ఒకటి
తయారీ విధానం : రికోట్టా చీజ్‌ని, పనీర్‌ను పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకోవాలి. క్యాప్సికం, టొమోటో, బంగాళాదుంపలను కూడా పెద్ద పెద్ద ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. వీటికి... పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, ఉప్పు, పచ్చిమిరప పేస్ట్, నిమ్మరసం, ధనియాల పొడి, జీడిపప్పు పొడి, తరిగిన పుదీనా, కొత్తిమీర, ఛాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి.
చివర్లో మస్టర్డ్ ఆయిల్ కూడా వేసి బాగా కలిపి, కాసేపు ఉంచిన తరువాత ఓవెన్లో పెట్టి వేయించాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాక వేయించి తీసేయాలి. అంతే రికోట్టా ఛీజ్ పనీర్ ఫ్రై సిద్ధమైనట్లే...! మీరూ చేస్తారు కదూ..!