కావలసిన పదార్థాలు : స్వీట్ పొటాటో(చిలకడదుంప) ఉడికించి సన్నగా తరిగినది - రెండు కప్పులు, మైదా పిండి - ఐదు చెంచాలు, చక్కెర - రెండు కప్పులు, వాసన కోసం ఏలకుల పొడి - చెంచా, వేయించడానికి నూనె - మీకు కావలసినంత, నెయ్యి - ఒకటిన్నర కప్పు.
తయారు చేయు విధానం : ముందుగా గులాబ్ జామూన్‌కు తయారు చేసేలా చక్కెర పాకాన్ని తయారు చేసుకోవాలి. తర్వాత మైదాను తీసుకుని చిలకడదుంపల ముక్కల్లో కలిపి ఇందులో ఏలకుల పొడి కాస్త నెయ్యి, చిటికెడు పాలు పోసి కలిపి కావలసిన సైజులో ఉండలు చేసుకోవాలి.
వీడిని నూనె లేదా నెయ్యిలో బంగారు రంగు వన్నె వచ్చేంత వరకు వేయించి దించి చక్కెర పాకంలో వేసి అరగంట పాటు ఉంచాలి. బాల్స్ పాకంలో మునిగేలా చాడాలి. తర్వాత అతిధులకు సర్వ్ చేయండి.