అవి జాత్యహంకార దాడులు కాదు: నిపుణులు

ఆస్ట్రేలియాలో ఇటీవల కాలంలో కలకలం సృష్టిస్తున్న భారతీయ విద్యార్థులపై దాడులు జాత్యహంకారపూరితమైనవి కాదని అక్కడి నిపుణులు భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా భారతీయులపై ఆరుసార్లు జాతివివక్ష దాడులు జరిగిన సంగతి తెలిసిందే.

అయితే ఈ దాడులకు జాతి దురహంకారం కారణం కాదని ఇటువంటి ఘటనల విశ్లేషకుడు జెరెమీ జోన్స్ అభిప్రాయపడ్డారు. దేశంలో వ్యవస్థీకృత జాత్యహంకార గ్రూపులు పెరుగుతున్న సూచనలేవీ కనిపించడం లేదన్నారు.

ప్రతిచోటా జాతి దురహంకారులను చూస్తూనే ఉంటాము. అయితే వారి గ్రూపులు పెరుగుతున్నాయనేందుకు ఎటువంటి సంకేతాలు లేవన్నారు. ప్రపంచంలో అంతర్‌వర్గ సంబంధాలు మెరుగైన స్థితిలో ఉన్న దేశాల్లో ఆస్ట్రేలియా కూడా ఒకటని చెప్పారు.

ఇటీవల ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై దాడులకు బాధ్యులైనవారు ఎక్కువగా అసాంఘిక శక్తులేనన్నారు. గడిచిన ఆరు, ఏడేళ్లలో దాడులకు ప్రధాన కేంద్రంగా మారిన మెల్‌బోర్న్‌లో విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీరిలో భారతీయ విద్యార్థుల శాతమే ఎక్కువ.

వెబ్దునియా పై చదవండి