ఆన్‌లైన్‌లో అమెరికా అణు రహస్యాలు

అమెరికా ప్రభుత్వం దురదృష్టవశాత్తూ అత్యంత రహస్య నివేదికనొకదానిని తనంతటతానుగా బహిర్గతం చేసింది. మీడియాలో బుధవారం వచ్చిన కథనాల ప్రకారం.. అమెరికాకు సంబంధించిన వందలాది పౌర అణు కేంద్రాలు, కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు కలిగివున్న నివేదిక అనుకోకుండా బహిర్గతమైంది.

అధికార ఆన్‌లైన్ న్యూస్‌లెటర్‌లో అమెరికా ప్రభుత్వం 266 పేజీలు ఉన్న ఈ నివేదికను ప్రచురించినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఈ వివరాలు బహిర్గతం కావడం వలన ఎటువంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని అణు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అమెరికా అణు రహస్యాలు బహిర్గతం కావడానికి గల కారణాలపై వివిధ దర్యాప్తులు ఇప్పటికే ప్రారంభమైనట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. న్యూయార్క్ టైమ్స్ ఈ నివేదిక బహిర్గతమైన విషయాన్ని అధికారిక యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లిన అనంతరం ఆ వెబ్‌సెట్ నుంచి దానిని తొలగించారు.

వెబ్దునియా పై చదవండి