ఆఫ్ఘనిస్థాన్- పాకిస్థాన్‌లో తీవ్రవాదంపై విజయం సాధించాలంటే ఈ రెండు దేశాల్లో స్థిరత్వం ఎంతో ముఖ్యమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్- పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో అమెరికా దళాల నేతృత్వంలో నాటో సేనలు తాలిబాన్, అల్ ఖైదా తీవ్రవాదులతో పోరాడుతున్న సంగతి తెలిసిందే.
అక్కడ తమ మిషన్ విజయవంతం కావాలంటే ఈ రెండు దేశాల్లో స్థిరత్వం ఎంతో కీలకమన్నారు. అప్పుడే అల్ ఖైదా, తాలిబాన్ తీవ్రవాదులపై విజయం సాధించిగలమని చెప్పారు. అమెరికానే కాకుండా, ఇతర దేశాలను కూడా లక్ష్యంగా చేసుకోగల వారి సామర్థ్యాన్ని నాశనం చేయడం తమ లక్ష్యమని తెలిపారు.