వర్షాకాలంలో మీ రోజును ఒక గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగడం ద్వారా ప్రారంభించండి. ఒక ముక్క అల్లం లేదా ఒక చుక్క తేనె, నిమ్మకాయను జోడించవచ్చు. ఇది మీ జీర్ణశక్తిని పెంపొందింపజేస్తుంది. శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది. జీవక్రియను సున్నితంగా ప్రారంభిస్తుంది. కాలక్రమేణా, ఇది ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతర్గత రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఆపై ఒక చెంచా నువ్వులు లేదా కొబ్బరి నూనె తీసుకొని 5 నుండి 10 నిమిషాలు మీ నోటిని పుక్కిలించండి. ఇది నోటి పరిశుభ్రతను బలోపేతం చేస్తుంది. గొంతు ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది, సూక్ష్మజీవులను నశింపజేస్తుంది. అలాగే రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇస్తుంది.
అలాగే మీ శ్వాస శక్తివంతమైన రోగనిరోధక శక్తికి మంచి మూలం. నాడీ వ్యవస్థను సమతుల్యం చేయడానికి, ఆక్సిజన్‌ను మెరుగుపరచడానికి, శరీరంలో వేడిని తగ్గించడానికి బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు సహాయపడతాయి. అంతేకాకుండా, అవి చాలా ప్రశాంతతను కలిగిస్తాయి. ముఖ్యంగా మిమ్మల్ని చురుకుగా వుంచుతాయి.
అశ్వగంధ, చవన్‌ప్రాష్‌ను ఆయుర్వేద నూనెలను ఉపయోగించి మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ముఖ్యంగా కీళ్ళు, తల చర్మం, అరికాళ్ళపై దృష్టి పెట్టండి.
ఇక చల్లని మిల్క్ షేక్స్ లేదా పచ్చి సలాడ్స్ తీసుకోవడం మానుకోండి. బదులుగా, తేలికగా కారంగా ఉండే పెసరపప్పు వంటకాలు, కిచ్డి, రాగి జావ, లేదా బొప్పాయి ఉడికించిన ఆపిల్స్ వంటి కాలానుగుణ పండ్లను ఎంచుకోండి. వేడిగా వున్న ఆహారాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. తేమతో కూడిన వర్షాకాలంలో అవసరమైన పోషకాల శోషణకు మద్దతు ఇస్తాయి.