ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలకు ఒబామా మొగ్గు

అనుమానాస్పద అణ్వాయుధ కార్యక్రమంపై చర్చలకు నిర్ణీత గడువులోగా ఇరాన్ స్పందించని పక్షంలో ఆ దేశంపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించేందుకు అమెరికా అధికారిక యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. వివాదాస్పద అణు కార్యక్రమంపై సెప్టంబరులోగా చర్చలు రావాలని అమెరికా గడువు విధించిన సంగతి తెలిసిందే.

ఈ గడువులోగా చర్చలకు ఇరాన్ అంగీకరించని పక్షంలో.. ఈ ఇస్లామికి రిపబ్లిక్‌పై మరిన్ని కఠిన ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది.

ఇరాన్ బాగా ఆధారపడుతున్న గాసోలిన్ దిగుమతులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా బరాక్ ఒబామా యంత్రాంగం ఆ దేశంపై ఒత్తిడి పెంచవచ్చని అమెరికా చట్టసభ సభ్యులు సూచిస్తున్నారు. ఇప్పటికే అమెరికా అధ్యక్ష భవన ప్రతినిధి ఒకరు ఇజ్రాయేల్‌తో గత నెలలో ఈ అంశంపై చర్చలు జరిపినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి