ఇరాన్: అసలే అణు వివాదం, ఆపై క్షిపణి పరీక్ష

వివాదాస్పద అణు కార్యక్రమంపై అగ్రరాజ్యాలు చిందులేస్తున్న తరుణంలో ఇరాన్ క్షిపణి పరీక్ష నిర్వహించింది. తమ మిలిటరీ స్వల్పదూరంలో లక్ష్యాలు చేధించే క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు ఇరాన్ అధికారిక వర్గాలు తెలిపాయి. తమ దేశానికి ఇతర దేశాల నుంచి ఉన్న మిలిటరీ ముప్పును తప్పించుకునేందుకు ఈ పరీక్ష నిర్వహించినట్లు ఇరాన్ మిలిటరీ వెల్లడించింది.

ఇదిలా ఉంటే దీనికి ముందురోజు అమెరికాసహా, మిగిలిన అగ్రరాజ్యాలు ఇరాన్ రెండో యురేనియం శుద్ధి ప్లాంటు ఉన్న విషయాన్ని బయటపెట్టడాన్ని తీవ్రంగా పరిగణించాయి. ఇరాన్ వివాదాస్పద అణు శుద్ధి కార్యక్రమంపై అగ్రరాజ్యాలు అగ్గిమీద గుగ్గిలమయ్యాయి. రెండు అణు ప్లాంటుపై డిసెంబరులోగా వివరాలు తెలియజేయాలని ఇరాన్‌కు అల్టిమేటం విధించాయి.

వెబ్దునియా పై చదవండి