ఇరాన్ ప్లాంటుపై అమెరికా, బ్రిటన్ అల్టిమేటం

ఇరాన్ వివాదాస్పద అణు కార్యక్రమంపై చాలాకాలం నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పశ్చిమ దేశాలు మరోసారి ఆ దేశంపై విరుచుకపడ్డాయి. ఇరాన్ తాజాగా తమ దేశంలో రెండో రహస్య యురేనియం శుద్ధి కేంద్రం ఉన్నట్లు బయటపెట్టడం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలకు ఆగ్రహం తెప్పించింది.

అమెరికా, దాని మిత్రదేశాలు రెండు యురేనియం శుద్ధి ప్లాంటు విషయంలో ఇరాన్‌కు అల్టిమేటం జారీ చేశాయి. ఈ రెండు ప్లాంటుపై అంతర్జాతీయ అభ్యంతరాలకు డిసెంబరులోగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. లేకుండా కఠిన ఆంక్షలు ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలని హెచ్చరించాయి.

ఇరాన్ వివాదాస్పద అణు కార్యక్రమం ఆ దేశం అణ్వాయుధాలు తయారు చేసేందుకు ఉద్దేశించిందని పశ్చిమ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇరాన్ ప్రభుత్వం తమ ఈ అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాలకు ఉద్దేశించిందని, దాని వెనుక అణ్వాయుధాలు తయారు చేసే ఆలోచన లేదని వాదిస్తోంది.

వెబ్దునియా పై చదవండి