ఉత్తర యమన్‌లోని విద్రోహశక్తులున్న సానా ప్రాంతంలో ఓ యుద్ధ విమానం పేలిపోయింది. గతంలో జైదీ షియా వర్గీయులు ఈ విమానాన్ని పేల్చివేస్తామని ప్రకటించియున్నారు.
సానా ప్రాంతంలోనున్న విద్రోహకశక్తులను అంతమొందించేందుకుగాను దాడులకు పాల్పడేందుకు ఈ యుద్ధ విమానం వెళ్ళింది. కాని కొన్ని సాంకేతిక కారణాల వలన ఆ విమానం పేలిపోయినట్లు సైనిక ప్రతినిధి ఒకరు రక్షణమంత్రిత్వ శాఖకు చెందిన వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
ఇదిలావుండగా దుర్ఘటనపాలైన విమానం ఇతర విమానాలతో కలిసి గాలిలో చక్కర్లు కొడుతుండిందని అనాద్ ప్రాంతంలో దుర్ఘటనకు ముందు భూమికి అతి సమీపంలో ఎగురుతుండిందని ప్రత్యక్షసాక్షులు చెప్పారు.