ఉరుంఖీ అల్లర్ల దర్యాప్తు: 319 మంది నిర్బంధం

చైనా పోలీసులు దేశ వాయువ్య ప్రాంతంలోని జిన్‌జియాంగ్ ప్రావీన్స్‌లో మరో 319 మంది ఉయ్‌గుర్ నిరసనకారులను అదుపులోకి తీసుకుంది. ప్రావీన్స్ రాజధాని ఉరుంఖీలో గత నెల ఐదున జరిగిన అల్లర్లపై జరుగుతున్నదర్యాప్తుకు సంబంధించి తాజాగా చైనా పోలీసులు వీరిని నిర్బంధించారు.

జులై 5న ఉరుంఖీలో జరిగిన హింసాత్మక అల్లర్లలో 197 మంది పౌరులు మృతి చెందిన సంగతి తెలిసిందే. వందలాది మంది గాయపడ్డారు. దీనిపై చైనా అధికారిక యంత్రాంగం దర్యాప్తు జరుపుతోంది. ఇప్పటివరకు అల్లర్లలో ప్రమేయం ఉందనే ఆరోపణలతో 1,572 మందిని నిర్బంధించింది. పోలీసుల దర్యాప్తులో దొరికిన ఆధారాలు, ప్రజల వద్ద నుంచి అందిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వీరిని అరెస్టు చేసినట్లు చైనా అధికారిక యంత్రాంగం తెలిపింది.

వెబ్దునియా పై చదవండి