ఎల్టీటీఈ పునరుద్ధరణకు చురుగ్గా ప్రయత్నాలు

శ్రీలంకలో కొన్ని దశాబ్దాలపాటు అంతర్యుద్ధానికి కారణమైన ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థను ఆ దేశ సైన్యం ఇటీవల ముగిసిన యుద్ధంలో పూర్తిగా నాశనం చేసింది. అయితే ఎల్టీటీఈని పునరుద్ధరించేందుకు, తలోదారిన వెళ్లిన ఆనాటి సాయుధ బలగాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నట్లు తెలుస్తోంది.

శ్రీలంక సైన్యం- ఎల్టీటీఈ మధ్య ఇటీవల జరిగిన తుది పోరులో చాలా మంది తీవ్రవాదులు సాధారణ పౌరులతో కలిసి ప్రభుత్వం నడుపుతున్న శరణార్థ శిబిరాల్లోకి వెళ్లారు. శ్రీలంక ఉత్తర ప్రాంతంలోని వావూనియా జిల్లాలో ప్రభుత్వం నిర్వహిస్తున్న శరణార్థ శిబిరాల్లో ఎల్టీటీఈ మాజీ సభ్యులు తలదాచుకుంటున్నట్లు అనుమానాలు ఉన్నాయి.

వీరిని మళ్లీ పోరు బాటలోకి తెచ్చి, ఎల్టీటీఈ ప్రధాన ధ్యేయాన్ని నెరవేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని శ్రీలంక మంత్రి ఒకరు తెలిపారు. ఎల్టీటీఈ పునరుద్ధరణ చర్యల్లో భాగంగానే వావూనియా ప్రాంతంలోని శరణార్థ శిబిరాల్లో ఉన్న మాజీ తీవ్రవాదులను ఏకీకృతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని శ్రీలంక రక్షణ శాఖ మంత్రి గోటాభాయా రాజపక్స హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి