ఏఎఫ్ విమాన ప్రమాదం: 228 మంది మృతి

ఎయిర్ ఫ్రాన్స్ (ఏఎఫ్)కు చెందిన విమానం ఒకటి అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోవడంతో 228 మంది దుర్మరణం చెందారు. బ్రెజిల్ రాజధాని రియో డి జెనీరో నుంచి పారిస్ వస్తున్న ఈ విమానం మార్గమధ్యంలో కూలిపోయింది. విమానంలోని మొత్తం 228 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

తుపానులో చిక్కుకోవడం, పిడుగుపాటుకు గురికావడమే విమానం కూలిపోవడానికి కారణాలని అధికారిక వర్గాలు సోమవారం వెల్లడించాయి. రియో డి జెనీరోలో టేకాఫ్ తీసుకున్న నాలుగు గంటల తరువాత విమానం తుపానులో చిక్కుకుందని ఎయిర్ ఫ్రాన్స్ వెల్లడించింది. విమానంలో విద్యుత్ సర్క్యూట్‌లో లోపం తలెత్తినట్లు చివరి సంకేతాలు అందాయి.

అనంతరం రాడార్ తెర నుంచి అదృశ్యమైన ఈ విమానం తుపానులో చిక్కుకుంది. విమాన శకలాల కోసం బ్రెజిల్, ఫ్రాన్స్ దేశాల వైమానిక దళాలు గాలిస్తున్నాయి. ఎయిర్ ఫ్రాన్స్ చరిత్రలో ఇదే ఘోర ప్రమాదం. ఇంత మంది ప్రయాణికులు గతంలో ఎన్నడూ చనిపోలేదు. విమానంలో 216 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి