కాశ్మీరు భారత్- పాక్‌లకు చెందదు: గడాఫి

లిబియా నేత ముయమ్మార్ గడాఫి భారతదేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తే ప్రకటనను చేశారు. ఎన్నాళ్లగానో నలుగుతున్న కాశ్మీరు అంశంపై మాట్లాడుతూ... కాశ్మీరుకు స్వతంత్ర ప్రతిపత్తిగల రాష్ట్రం హోదాను ఇచ్చేసి భారత్- పాక్‌లు అక్కడ నుంచి శాశ్వతంగా వైదొలగాలి. కాశ్మీరు ఆ రెండు దేశాలకు చెందనదిగా పరిగణించాలి" అన్నారు.

ఐక్యరాజ్య సమిత సమావేశాల్లో భాగంగా బుధవారంనాడు గడాఫి పలు అంశాలపై సుదీర్ఘమైన ప్రసంగం చేశారు. తనకు కేటాయించిన 15 నిమిషాల సమయానికి మించి సుమారు గంటన్నరపాటు ఆయా అంశాలపై చర్చించారు.

కాశ్మీరు అంశంతోపాటు అమెరికా, ఐక్యరాజ్య సమితిలపైనా విరుచుక పడ్డారు. భద్రతామండలిని తీవ్రవాద మండలిగా అభివర్ణించారు. ప్రపంచాన్ని శాసించేటటువంటి కొన్ని కీలక అధికారాలను భద్రతామండలికి కట్టబెట్టడంపై మండిపడ్డారు.

అలాగే సభ్య దేశాలను సమానత్వంతో చూడటం లేదనీ, ఒక దేశానికి ఇస్తున్న ప్రాధాన్యత మరో దేశానికి ఇవ్వడం లేదని ఆరోపించారు. అందుకు ఉదాహరణగా భారత్- పాకిస్తాన్ గురించి చెపుతూ.. ఈ రెండు దేశాలు అణుశక్తి కలిగిన దేశాలనీ, కానీ భారతదేశానికి ఇచ్చిన ప్రాధాన్యత దాని పొరుగు దేశమైన పాకిస్తాన్‌కు ఇవ్వకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి