విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. హిందీలో సామ్రాజ్య పేరుతో విడుదల కాబోతోంది. విజయ్ దేవరకొండ చాలా కాలం తర్వాత సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. విడుదలైన టీజర్ లో యాక్షన్ ఎపిసోడ్స్ బాగా చూపించారు. కాగా, ట్రైలర్ లో అసలు కథ వుంటుందని దర్శకుడు తెలియజేస్తున్నాడు. ఇక సినిమా కూడా ఈనెల 31న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
కాగా,. ఈ ట్రైలర్ ఈవెంట్‌ను తిరుపతిలో నిర్వహించబోతున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఇక ఇందులో సత్యదేవ్ పాత్ర సరికొత్తగా వుంటుందని తెలుస్తోంది. భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి.