కాశ్మీర్ సమస్య పరిష్కారానికి ఇదే అదను: ముష్

ఉపఖండంలో శాంతికి భంగం కలిగించే సమస్యల్లో ఒకటైన కాశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు తగిన సమయం ఇదేనని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అభిప్రాయపడ్డారు. గతంలో జరిగిన దుస్సంఘటనలన్నిటినీ ఇరు దేశాలు ప్రక్కన పెట్టి కాశ్మీరు వంటి కీలక సమస్యలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.

చర్చలకు అనుకూలంగా ప్రస్తుతం వాతావరణం నెలకొని ఉన్నదనీ, భారత్-పాకిస్తాన్‌లు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య నెలకొన్న మనస్పర్థలను తొలగించి శాంతిని పాదుకొల్పాల్సిన బాధ్యత నాయకులపై ఉందని ముష్ తెలిపారు.

పాకిస్తాన్‌ను తొమ్మిదేళ్లపాటు పాలించిన ముషారఫ్ ఇండియా టుడే పత్రికతో తన భావాలను పంచుకున్నారు. తన పాలనా కాలంలో ఎదురైన సమస్యలను ఎలా పరిష్కరించిందీ వివరించారు.

వెబ్దునియా పై చదవండి