కొత్త విప్లవానికి సమయం ఆసన్నమైంది: ప్రచండ

దేశంలో కొత్త కమ్యూనిస్ట్ విప్లవానికి సమయం ఆసన్నమైందని ఆ దేశ మావోయిస్టు పార్టీ చీఫ్ ప్రచండ హెచ్చరించారు. దేశ రాజకీయ పరిణామాల్లో పాత రాజకీయ పార్టీలు జోక్యం చేసుకుంటే.. లేదా.. అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే.. కొత్త విప్లవం తప్పదని ఆయన తెలిపారు.

ఖాట్మండులో మావోయిస్టు పార్టీ నేతృత్వంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ప్రచండ కార్యకర్తలను ఉద్దేశించి విలేకరులతో మాట్లాడారు. మావోయిస్టులు చేస్తన్న నిరసన ఉద్యమాలు.. త్వరలోనే కొత్త విప్లవానికి దారితీసేందుకు ఆస్కారం ఉందన్నారు.

పాత పార్టీలు దేశ భవిష్యత్‌పై కాకుండా.. ఇక్కడి పరిణామాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని.. ఇది జరుగుతున్నంత కాలం.. మావోయిస్టుల నిరసనోద్యమాలు ఆగవని తేల్చి చెప్పారు. కాగా, నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ కతావల్‌ను ఆదేశాధ్యక్షుడు రామ్‌బరణ్ యాదవ్ పునర్నియమించారు. దీన్ని వ్యతిరేకించిన ప్రచండ ప్రధాని పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి