చైనాలో రహస్యంగా పర్యటించిన ఐఎస్‌ఐ చీఫ్

పాకిస్థాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ ఛీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షూజా పాషా చైనాలో రహ్యసంగా పర్యటించారు. సైనిక, ఇంటలిజెన్స్ సంబంధాల్లో అంతరాయం ఏర్పడ్డ కారణంగా అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించే భాగంగా ఈ పర్యటన సాగింది.

పాషా తన పర్యటనతో బీజింగ్‌తో వ్యూహాత్మక చర్చలకు నాంది పలికారని ద ఎక్స్‌ప్రెస్ ట్రైబ్యూన్ పత్రిక తన కథనంలో తెలిపింది. పాకిస్థాన్ ఆర్మీ స్టాఫ్ ఛీఫ్ లెఫ్టినెంట్ జనరల్ వాహిద్ అర్షద్‌ చైనాలో పర్యటించిన రెండు వారాల్లోపే పాషా బీజింగ్‌లో రహస్యంగా పర్యటించడం విశేషం.

ఇస్లామాబాద్‌లోని సీఐఏ కార్యాలయ ఛీఫ్ ఆకస్మికంగా వైదొలగిన తర్వాత ఐఎస్ఐ ఛీప్ చైనాకు వెళ్లారు. దాయాది దేశం పాకిస్థాన్, చైనాల మధ్య జరుగుతున్న ఈ పరిణామాలు సహజంగానే భారత్‌కు ఆందోళన గురిచేస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి