తాజాగా విడుదలైన గ్లింప్స్ వింటేజ్ వైబ్ తో అదిరిపోయింది. ఊరి స్టేజీలు, జనం కేరింతలు, ఫోక్ ఐకాన్ గా నిలిచిన గరివిడి లక్ష్మి ఎంట్రీతో గ్లింప్స్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది.
లక్ష్మిగా ఆనందీ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా వుంది. 15 ఏళ్లలో 10,000 స్టేజీలను తాకిన గాయనీ జీవితాన్ని రిక్రియేట్ చేసింది. ఆమె పాటలు వింటూ ఎదిగిన 90స్ తరం మళ్లీ అలానే ఫీల్ అవుతుంది. ఆడియో క్యాసెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయిన రోజులను గుర్తు చేస్తుంది.
చరణ్ అర్జున్ అందించిన నేపథ్య సంగీతం ఆ విజువల్స్‌ని మరింత ఎలివేట్ చేసింది. పాటలు, సంగీతం, ఆర్ట్– ఇవన్నీ కలసి ఈ గ్లింప్స్‌ని అద్భుతంగా మార్చాయి.
గరివిడి లక్ష్మి మన ఊరి పాటలు, అనుభూతులు, మన మూలాల నుంచి వచ్చే ఆత్మగౌరవానికి సెల్యూట్ లాంటి సినిమా.
తారాగణం: నరేష్, రాశి, ఆనంది, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్, కంచరపాలెం కిషోర్, శరణ్య ప్రదీప్, కుశాలిని