జపాన్ ప్రధానమంత్రి నొవొటో కన్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో జపాన్ ఐదు సంవత్సరాల్లో ఆరో ప్రధానిని చూడనుంది. మార్చిలో సంభవించిన భారీ భూకంపం, సునామీలు వాటి అనంతరం ఏర్పడ్డ అణు సంక్షోభాన్ని సమర్ధంగా ఎదుర్కోవడంలో నొవొటో కన్ విఫలమయినందున రాజీనామా చేయాలని ప్రతిపక్షాలతో పాటు అధికార పార్టీలోని కొందరు సభ్యులు కొంతకాలం నుంచి ఒత్తిడి చేస్తున్నారు.
ఆగస్ట్ 29న జరిగే ఓటింగ్‌లో అధికార జపాన్ డెమొక్రటిక్ పార్టీ నుంచి ఆరుగురు రాజకీయనాయకులు కన్ స్థానం కోసం పోటీపడుతున్నారు. మాజీ విదేశాంగ సీజీ మయిహర, ఆర్ధిక మంత్రి యెషిహికో నొడాలు కూడా రేసులో ఉన్నారు. ఈ ఓటింగ్‌లో గెలిచిన వారు పార్లమెంట్ దిగువ సభలో పార్టీ మెజారిటీకి అనుగుణంగా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది.