జాతి వివక్ష: చట్ట సవరణలు చేసిన ఆస్ట్రేలియా

విదేశీ విద్యార్థులకు సురక్షిత వాతావరణం, పటిష్ట భద్రత కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్ర ప్రధానమంత్రి జాన్ బ్రుంబై హామీ ఇచ్చారు. భారత్‌పాటు, ఇక్కడకు వచ్చి ఉంటున్న విదేశీ విద్యార్థులరికీ సురక్షిత వాతావరణం నెలకొల్పుతామని తెలిపారు. ఇందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.

ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న బ్రుంబై మాట్లాడుతూ.. విక్టోరియా రాష్ట్రంలో విదేశీ విద్యార్థులపై జాతి వివక్ష దాడులను అడ్డుకునేందుకు తమ ప్రభుత్వం చట్టాలను కఠినతరం చేస్తూ సవరణలు చేసిందని తెలిపారు. బ్రుంబై న్యూఢిల్లీలో కేంద్ర విదేశీ భారతీయ వ్యవహారాల శాఖ మంత్రి వాయిలార్ రవితో సమావేశమయ్యారు.

ఇటీవల ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై వరుసగా జాతి వివక్ష దాడులు జరగడం ఆందోళన సృష్టించిన సంగతి తెలిసిందే. తమ విద్యార్థులకు పటిష్ట భద్రత కల్పించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వానికి భారత్ పలుమార్లు విజ్ఞప్తులు కూడా చేసింది. దీనిపై భారత పర్యటనలో ఉన్న విక్టోరియా ప్రధానమంత్రి బ్రుంబై విదేశీ విద్యార్థుల రక్షణను దృష్టిలో ఉంచుకొని తమ చట్టాలను కఠినతరం చేశామని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి