ధూమపానం చేస్తున్నారా: కోటి రూపాయల అపరాధం

శుక్రవారం, 8 జనవరి 2010 (15:00 IST)
పొగ సేవించినా, పొగాకు సంబంధిత ఉత్పత్తులను విక్రయించినా కోటి నుంచి కోటిన్నర రూపాయల అపరాధం విధించనున్నట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రకటించింది. ఈ మేరకు, కఠిన నిబంధనలతో రూపొందించిన కొత్త బిల్లుపై యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖాలిబా బిన్ సయీద్ తాజాగా సంతకం చేశారు.

ఈ కొత్త చట్టం మేరకు బహిరంగ, ప్రజా ఉపయోగ ప్రాంతాల్లో పొగ సేవించినా, 18 సంవత్సరాల వయస్సు లోపు వారికి పొగాకు ఉత్పత్తులు విక్రయించినా, 1.2 కోట్ల రూపాయల అపరాధంతో పాటు.. రెండు సంవత్సరాల జైలు శిక్షను కూడా విధించనున్నట్టు తెలిపారు.

అలాగే, పొగాకు ఉత్పత్తులు విక్రయించేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన లైసెన్సును కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. వీటితో పాటు.. 12 సంవత్సరాల వయస్సున్న బాలురు ఉండే కారులో పొగ సేవిచడాన్ని నేరంగా పరిగణిస్తామని హెచ్చరించారు. పొగాకు ఉత్పత్తుల ప్రచారంపై నిషేధం విధించనున్నట్టు సయీద్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి