నేడు ప్రమాణం చేయనున్న జాకబ్ జుమా

దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా జాకబ్ జుమా శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి భారత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీతో సహా 30 దేశాలకు చెందిన ప్రభుత్వాధినేతలు హాజరుకానున్నారు. ముఖ్యంగా, జాకమ్ జుమా ప్రమాణానికి ఆయన ముగ్గురు భార్యలను ప్రత్యేకంగా ఆహ్వానించారు.

దక్షిణాఫ్రికా అధ్యక్ష ప్యాలెస్‌లో జరిగే ఈ కార్యక్రమంలో జుమా చేత ఆ దేశ చీఫ్ జస్టీస్ పైస్ లంగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి సుమారు 30 వేల మంది హాజరుకావచ్చని భావిస్తున్నారు.

కాగా, భారత తరపున అన్సారీతో సహా శ్రీలంక ప్రధానమంత్రి రత్నసిరి విక్రమసింఘే, బ్రిటన్ విదేశాంగ సహాయ మంత్రి మార్క్ మల్లోచ్ బ్రౌన్, దక్షిణాఫ్రికా నల్లజాతి వజ్రం నెల్సన్ మండేలా హాజరుకానున్నారు.

ఇదిలావుండగా, 67 సంవత్సరాల జుబా.. తన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి తన ముగ్గురు భార్యలను ఆహ్వానించారు. దీనిపై ప్రభుత్వ అధికార ప్రతినిధి థెంబా మెసెకో మాట్లాడుతూ.. తన పిల్లలతో కలిసి ముగ్గురు భార్యలు ప్రమాణ స్వీకార సమయంలో దగ్గర ఉండాలని కోరారన్నారు.

ఈ కార్యక్రమానికి వచ్చే జుబా భార్యలకు వీఐపీ హోదా కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా జుబా మాట్లాడుతూ.. దేశ అత్యున్నత పదవిని చేపట్టే తాను దేశ ప్రజల సంక్షేమం పని చేస్తానని హామీ ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి