పశ్చిమ నేపాల్‌లోని మస్తామాండో గ్రామంలో మంగళవారంనాడు భూకంపం సంభవించింది. దీంతో 12 మంది మృతి చెందగా 11 ఇండ్లు ధ్వంసమయ్యాయి.
ఖాట్మండ్ నుంచి దాదాపు 525 కిలోమీటర్ల దూరంలోనున్న డాడేలధురా జిల్లాలో భూమి కంపించిందని, ఈ దుర్ఘటనలో 12 మంది మృతి చెందగా దాదాపు 11 గృహాలు దెబ్బతిన్నట్లు స్థానిక పోలీసు ఉన్నతాధికారి చక్రబహాదుర్ సింగ్ తెలిపారు.
కూలిపోయిన భవనాలలోంచి ఇప్పటి వరకు ఐదు శవాలను వెలికి తీసామని మిగిలిన మృతదేహాలను వెలికి తీయాల్సి వుందని ఆయన వివరించారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల తర్వాత భూకంపం సంభవించిందని ఆయన తెలిపారు.