న్యూయార్క్ అటార్నీగా ఎన్ఆర్ఐ

దేశంకాని దేశం అమెరికాలో మరో ప్రవాస భారతీయుడుకి అరుదైన గౌరవం దక్కింది. పంజాబ్‌లో జన్మించిన బర్నాలాను దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక న్యూయార్క్‌ అటార్నీగా నియమిస్తూ ఆ దేశాధ్యక్షుడు బరాక్‌ హుస్సేన్ ఒబామా ఆదేశాలు జారీ చేశారు.

ఇదిలావుండగా బర్నాలాతోబాటు మరో నలుగురినికూడా అటార్నీలుగా నియమించినట్లు తమ అధ్యక్షుడు ప్రకటన చేశారని వైట్‌హౌస్‌ వెల్లడించింది.

ప్రతిష్టాత్మకమైన పదవిలో నియమితులైన వీరంతా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారని ఒబామా ఆశాభావం వ్యక్తం చేసినట్టు పేర్కొన్నారు.

కాగా అటార్నీగా నియమితులైన బర్నాలా అమెరికాలోని న్యాయవిభాగంలో ఇప్పటికే పలు పదవులను చేపట్టినట్లు సమాచారం. తనకు ప్రతిష్టాత్మకమైన పదవి రావడం తనకెంతో ఆనందంగా ఉందని, ఈ పదవికి తాను న్యాయం చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి