పాక్ వాయువ్య ప్రాంతంలో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లోని సమస్యాత్మక వాయువ్య ప్రాంతంలో సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో ఐదుగురు మృతి చెందారు. తాలిబాన్ వ్యతిరేక గిరిజన నేతను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగింది. పాక్‌లోని నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో ఇటీవల కాలంలో తాలిబాన్ల ఆత్మాహుతి దాడులు బాగా పెరిగాయి. రోజూ ఇక్కడే ఏదో ఒక చోట వారు ఆత్మాహుతి దాడులకు పాల్పడుతున్నారు.

ప్రభుత్వ మద్దతుదారుగా పేరొందిన గిరిజన నేత మాలిక్ అబ్దుల్ హకీమ్ ప్రయాణిస్తున్న కారును పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు ఢీకొట్టాడు. బన్ను ప్రాంతంలో సోమవారం ఉదయం ఓ పోలీస్ చెక్‌పాయింట్ వద్ద ఈ ఆత్మాహుతి దాడి జరిగింది.

దాడిలో హకీమ్ కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. తాలిబాన్‌లపై పోరు కోసం ఏర్పాటు చేసిన శాంతి కమిటీలో హకీమ్ కీలక సభ్యుడు. సమస్యాత్మక ఉత్తర వజీరిస్థాన్ గిరిజన ప్రాంతంలోని మిరాన్‌షాకు వెళ్లే రోడ్డుపై జరిగిన ఆత్మాహుతి దాడిలో హకీమ్ ప్రాణాలు కోల్పోయారు.

వెబ్దునియా పై చదవండి