పోర్ట్ ఆఫ్ స్పెయిన్ చేరుకున్న ప్రధాని

శుక్రవారం, 27 నవంబరు 2009 (11:06 IST)
వాషింగ్‌టన్ పర్యటన అనంతరం భారతప్రధాని మన్మోహన్ సింగ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం పోర్ట్ స్పెయిన్ చేరుకున్నారు.

భారత ప్రధాని మన్మోహన్ సింగ్ తన వాషింగ్‌టన్ రాజకీయ పర్యటన అనంతరం మూడు రోజుల పర్యటన నిమిత్తం పోర్ట్ స్పెయిన్ చేరుకున్నారు. ఇక్కడ ఆయన ఇతర దేశాధ్యక్షులతో సమావేశం కానున్నారు. వీరి సమావేశంలో ప్రధానంగా ఉగ్రవాదం, జలవాయు కాలుష్యం, ప్రంపంచంలో నెలకొన్న మరిన్ని సమస్యలపై చర్చించనున్నారు.


దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం శుక్రవారం స్పెయిన్లో జరగనుంది. ఇందులో ప్రధాని పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో ప్రపంచంలో నెలకొన్న పలు సమస్యలవై చర్చించనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.

ఈ సమావేశంలో ప్రధాని మన్మోహన్‌తోపాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ, బ్రిటన్ ప్రధాని గార్డన్ బ్రౌన్, శ్రీలంక ప్రధాని రానిల్ విక్రమనాయకే, దేశంలోని ఇతర నాయకులు పాల్గొననున్నారు.

దీనికి ముందు వాషింగ్‌టన్‌లో నాలుగు రోజుల రాజకీయ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఏండ్ర్యూజ్ ఎయర్‌ఫోర్స్ బెస్‌‍‍‌పై 19 సాయుధ దళాలు వందనం చేసాయి. అక్కడి నుంచి ట్రినిడాడ్ డోబేగోకు ప్రయాణమయ్యారు.

వెబ్దునియా పై చదవండి