ఫలించిన బిల్ దౌత్యం: జర్నలిస్ట్‌ల విడుదల

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఉత్తర కొరియా అధికారిక యంత్రాంగంతో జరిపిన చర్చలు ఫలించాయి. అమెరికాకు చెందిన ఇద్దరు జర్నలిస్ట్‌లు అక్రమంగా తమ భూభాగంలోకి ప్రవేశించినందుకు ఉత్తర కొరియా వారిని నిర్బంధించింది. అంతేకాకుండా వీరికి ఆ ఆరోపణలపై 12 ఏళ్ల కఠిన కార్మిక శిక్షను కూడా విధించారు.

ఈ నేపథ్యంలో జర్నలిస్ట్‌ల విడుదల బాధ్యతను స్వచ్ఛందంగా తన భుజాలకెత్తుకొని బిల్ క్లింటన్ మంగళవారం ఉత్తర కొరియాలో అడుగుపెట్టారు. వీరి విడుదలపై ఉత్తర కొరియా నేతలతో బిల్ క్లింటన్ జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. దీంతో ఈ ఇద్దరు మహిళా జర్నలిస్ట్‌లు ఉత్తర కొరియా నిర్బంధం నుంచి విడుదలయ్యారు.

వీరు క్లింటన్‌తోపాటే బుధవారం అమెరికాకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ ఇద్దరు అమెరికా జర్నలిస్ట్‌లను ఉత్తర కొరియా అధికారిక యంత్రాంగం ఈ ఏడాది మార్చిలో అదుపులోకి తీసుకుంది. చైనా సరిహద్దుల గుండా తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించినట్లు వీరిపై అభియోగాలు మోపింది. వీరికి ఉత్తర కొరియా కోర్టు 12 ఏళ్లు జైలు శిక్ష కూడా విధించింది.

వీరి విడుదల కోసం అమెరికా ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసింది. తాజాగా వీరి విడుదల బాధ్యతలను తన భుజాలకెత్తుకొని బిల్ క్లింటన్ ఉత్తర కొరియాలో అడుగుపెట్టారు. వీరి విడుదలకు ఉత్తర కొరియా అధికారిక యంత్రాంగాన్ని ఆయన ఒప్పించారు. అమెరికా డెమొక్రటిక్ పార్టీకి చెందిన ఓ వార్తా సంస్థలోనే ఇద్దరు మహిళా జర్నలిస్ట్‌లు పనిచేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి