భారత్- పాక్ చర్చల పునరుద్ధరణ సాధ్యమే, కానీ

పాకిస్థాన్‌తో నిలిపివేసిన శాంతి ప్రక్రియ చర్చలు పునరుద్ధరించడం సాధ్యపడుతుందని చెప్పిన భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దానికి ఒక షరతు విధించారు. గత ఏడాది ముంబయి ఉగ్రవాద దాడుల సూత్రధారులను పట్టుకొని చట్టం ముందు నిలబెట్టినప్పుడే పాకిస్థాన్‌తో తాము తిరిగి శాంతి ప్రక్రియ చర్చలు పునరుద్ధిస్తామని పునరుద్ఘాటించారు. జి- 20 సదస్సు ముగిసిన సందర్భంగా శుక్రవారం రాత్రి ప్రధాని అమెరికాలో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

భారత్‌పై గురిపెట్టిన తీవ్రవాద గ్రూపులపై పాకిస్థాన్ నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని, అప్పుడు ఇరుదేశాల మధ్య మళ్లీ చర్చలు సాధ్యపడతాయని తేల్చిచెప్పారు. ముంబయి దాడుల సుత్రధారులపై చర్యలు తీసుకొని, పాకిస్థాన్‌తో కలిసి మరింత ముందుకు నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. పార్లమెంట్‌లో తాను చేసిన ప్రకటన విషయంలో ఈ మాత్రం రాజీపడబోమని స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి