భారత్- పాక్ వివాదాలకు అమెరికా కారణం

పాకిస్థాన్, భారత్ మధ్య తీవ్ర విభేదాలకు అమెరికా, ఇజ్రాయేల్ దేశాలే కారణమని లిబియా నేత మొమ్మర్ గఢాఫీ అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ తన ముస్లిం బాంబును పశ్చిమ దేశాలపై ప్రయోగించకుండా అమెరికా, ఇజ్రాయేల్ ఈ మార్గాన్ని అనుసరిస్తున్నాయన్నారు. భారత్, పాకిస్థాన్ మధ్య ఈ రెండు దేశాలు తీవ్ర వివాదాలను పెంచి పోషిస్తున్నాయని గఢాఫీ ఘాటైన విమర్శలు చేశారు.

మీకు శత్రువులు హిందువులేనని, యూదులు, క్రైస్తవులు కాదని పాకిస్థానీయులకు వారు చెప్పారు. దీంతో వారి దృష్టి భారత్‌పై పడేటట్లు చేశారు. పాకిస్థాన్‌కు తక్షణ శత్రువుగా భారత్ మాత్రమేనని, ఇంకెవరూ కాదని అమెరికా, ఇజ్రాయేల్‌‍లు ఓ భావన కలిగించాయన్నారు. వాషింగ్టన్ టైమ్స్‌కు రాసిన కథనంలో గఢాఫీ ఈ ఆరోపణలు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో భారతీయులు కూడా తమ శత్రువు పాకిస్థాన్ అని, వారి లక్ష్యం తామేనని భావిస్తున్నట్లు గఢాఫీ అభిప్రాయపడ్డారు.

వెబ్దునియా పై చదవండి