మాంద్యం ఎఫెక్ట్: నిరుద్యోగంలో స్పెయిన్‌కు తొలి స్థానం

ఆర్థిక మాంద్యం ప్రపంచ దేశాలను కుదిపేస్తున్నాయి. దీని వల్ల ఉద్యోగాలు కోల్పోతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఫలింతగా అనేక ప్రపంచ దేశాల్లో నిరుద్యోగ తాండవిస్తోంది. ఈ జాబితాలో స్పెయిన్‌కు మొదటి స్థానం దక్కగా, ఐరోపాలో రికార్డు స్థాయికి చేరుకుంది.

అయితే, మాంద్యం ప్రభావాన్ని ముందే పసిగట్టి పొదుపు చర్యలు చేపట్టిన గ్రీస్‌ 40 శాతం నిరుద్యోగులతో రెండో స్థానంలో ఉండగా, ఇక మూడో స్థానంలో ఇటలీ (28 శాతం), పోర్చుగలో, ఐర్లాండ్‌, ఫ్రాన్స్‌ దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

2008లో లేమన్‌ బ్రదర్స్‌ ఆర్థిక సామాజ్య్రం కుప్పకూలక ముందు ఐరోపా దేశాల్లో నిరుద్యోగం సగటున 15 శాతం మేర ఉండేది. ప్రస్తుతం ఇది 20 శాతానికి చేరిందని జర్మనీ గణాంకాల విభాగం విడుదల ఒక ప్రకటనలో పేర్కొంది.

ఐరోపా కూటమికి చెందిన మొత్తం 27 దేశాలలోని మొత్తం 15-24 ఏళ్ల మధ్య వయస్కులైన యువతలో 20.5 శాతం మంది ఇప్పుడు ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఐరోపా దేశాల కూటమి నుండి ఉద్దీపన ప్రయోజనాలు పొంది పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టిన గ్రీస్‌ 40 శాతం నిరుద్యోగులతో ఈ వరుసలో రెండో స్థానంలో వుంది.

బ్రిటన్‌లోని జాతీయ గణాంకాల కార్యాలయం వివరాల ప్రకారం దేశంలో 16-24 మధ్య వయస్కుల్లో నిరుద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అతి తక్కువ శాతం మంది నిరుద్యోగులున్న దేశాల్లో జర్మనీ ఒకటి. ఈ దేశంలో నిరుద్యోగుల సంఖ్య కేవలం 9.1 శాతం మాత్రమేనని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి