ముంబయి ఉగ్రవాద దాడుల్లో లష్కరే ప్రమేయం

గత ఏడాది నవంబరులో జరిగిన ముంబయి ఉగ్రవాద దాడుల్లో పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబా హస్తం ఉందని బ్రిటన్ పార్లమెంటరీ కమిటీ నివేదిక వెల్లడించింది. ముంబయి ఉగ్రవాద దాడులతోపాటు, ప్రపంచవ్యాప్తంగా వివిధ తీవ్రవాద దాడులకు లష్కరే తోయిబానే కుట్ర పన్నిందని పేర్కొంది.

ముంబయి, లండన్, మాడ్రిడ్, బాలిల్లో జరిగిన తీవ్రవాద దాడుల్లో లష్కరే ప్రమేయం ఉందని ఈ నివేదిక తెలిపింది. ఈ తీవ్రవాద సంస్థకు పాకిస్థాన్‌లోని సమస్యాత్మక గిరిజన ప్రాంతాల్లో మూలాలు ఉన్నాయని సీఐఏ మాజీ డైరెక్టర్ చెప్పినట్లు బ్రిటన్ విదేశీ వ్యవహారాల కమిటీ తన నివేదికలో పేర్కొంది.

పాకిస్థాన్ గిరిజన ప్రాంతాల్లోనే లండన్, మాడ్రిడ్, బాలి, ఇస్లామాబాద్, జర్మనీ, డెన్మార్క్‌‍లలో తీవ్రవాద దాడులకు కుట్ర జరిగిందని "అంతర్జాతీయ భద్రత: ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్" అనే పేరుతో రూపొందించిన బ్రిటన్ నివేదిక వెల్లడించింది. పశ్చిమ దేశాల పౌరులను లక్ష్యంగా చేసుకొని గత ఏడాది ముంబయిలో జరిగిన ఉగ్రవాదుల దాడికి కూడా లష్కరే తోయిబానే సూత్రధారి అని పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి