విడుదలైన జమాత్-ఉద్-దవా నేత సయీద్

నిరుడు నవంబర్‌ 26న ముంబైలో ఉగ్రవాదుల మారణకాండకు ప్రధాన సూత్రధారిగా బావిస్తున్న వ్యక్తికి అనుకూలంగా లాహోర్‌ హైకోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. 26/11 దాడుల కేసుల్లో ప్రధాన నిందితుడైన జమాత్‌-ఉద్‌-దవా నేత హాఫీజ్‌ సయీద్‌‌కు విధించిన గృహ నిర్భంధాన్ని ఎత్తి వేయాలని లాహోర్‌ హైకోర్టు మంగళవారం తీర్పు చెప్పింది.

హాఫీజ్‌ తరఫు న్యాయవాది ఇచ్చిన హెబియస్‌ కార్పస్‌ రిట్‌ ఆధారంగా ముహమ్మద్ సయీద్‌, నజీర్‌ అహ్మద్‌‌లను విడుదల చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. అయితే సయీద్‌‌ను భారత్‌కు అప్పగించాలన్న డిమాండ్‌‌ను పాక్‌ తోసిపుచ్చింది.

లాహోర్‌ ఉన్నత న్యాయస్థానం త్రిసభ్య కమిటీలో న్యాయవాది ఏకే డోగర్ వాదనలు విన్న తర్వాత వీరిని విడుదల చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. తమని గృహ నిర్బంధంలో ఉంచి చట్టాలను కాలరాసారని ఆ ఇరువురు ఆరోపించారు. దీనిపై కోర్టు ఆదేశాలు త్వరలో విడుదల కానున్నాయని డోగర్ అన్నారు.

ఇదిలావుండగా అమెరికా రక్షణ దళం జమాత్-ఉద్-దవా సంస్థకు చెందిన సంపదను తమ ఆధీనంలోకి తీసుకుందని, ఈ సంస్థకు చెందిన నాయకుల ప్రయాణాలనుకూడా నిరోధించేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నించిందని డోగర్ తన వాదనలను న్యాయమూర్తికి వినిపించారు.

వెబ్దునియా పై చదవండి