వియత్నాంలో తుఫానుః 160 మంది మృతి

వియత్నాంలో "కేత్సానా" అనే పేరుగల తుఫాను కారణంగా దాదాపు 163 మంది మృతి చెందగా మరో 616 మంది తీవ్రగాయాల పాలైనారు.

తుఫాను కారణంగా ది కోన్ టుమ్ ప్రాంతంలో తీవ్రమైన ప్రభావం పడింది. కువాంగ్ నగయీ ప్రాంతంలో 35 మంది, కువాంగ్ నామ్ ప్రాంతంలో 26 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి.

"కేత్సానా" తుఫాను కారణంగా భారీ వర్షాలు కురవడం మొదలైయ్యాయి. దీంతో చాలా ప్రాంతాల్లో వరద తీవ్రత పెరిగింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, సంచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని అధికారులు పేర్కొన్నారు.

తుఫాను బాధితులకు సహాయక చర్యలు చేపట్టి, వారికి కావలసిన ఆహార పదార్థాలు, వస్త్ర, వస్తు సామగ్రిని అందజేసినట్లు అధికారులు తెలిపారు.

ఇదిలావుండగా తుఫాను బాధిత ప్రాంతాల్లోని ప్రజలకు వియత్నాం ప్రభుత్వం 2.8 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం అందజేసింది. అలాగే పది వేల టన్నుల బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది.

వెబ్దునియా పై చదవండి