సూకీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బ్రౌన్

ప్రజాస్వామ్య నాయకురాలైన ఆంగ్ సాన్ సూకీకి రానున్న నెలలో జన్మదినం సందర్భంగా బ్రిటన్ ప్రధాని గార్డన్ బ్రౌన్ శుభాకాంక్షలు తెలిపారు.

బ్రౌన్ తన వెబ్ సైట్లో సూకీకి శుభాకాంక్షలందజేస్తూ ఆమెను విడుదల చేయమని కోరేవారిలో తానుకూడా ఉన్నట్లు ఆ సందేశంలో పేర్కొన్నారు. జూన్ నెల 19వ తేదీన సూకీ జన్మదినం కాబట్టి ఇప్పుడే తను ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నట్లు ఆయన తన సైట్‌లో పేర్కొన్నారు.

గతంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా ఆమెను ఎలాంట షరతులు విధించకుండా విడుదల చేయాలని కోరినట్లు ఆయన గుర్తు చేశారు.

ఇదిలావుండగా గత ఆరు నెలలుగా తన ఇంట్లోనే గృహ నిర్బంధంలోనున్న నోబెల్ బహుమతి గృహీత సూకీ ఈ నెలలో ఆమెను అదుపులోకి తీసుకున్న విషయం విదితమే.

కాగా ఆమెపై ఉన్న నిందారోపణ రుజువైతే మరో ఐదేళ్ళు ఆమెకు శిక్ష తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి