అణు పరీక్షలు.. క్షిపణి పరీక్షలతో ప్రపంచ దేశాలకు సవాలు విసురుతున్న ఉత్తర కొరియాపై అమెరికా భావి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించాడు. ఉత్తర కొరియాను డొనాల్డ్ ట్రంప్ గడ్డిపోచలా తీసిపాడేశారు. అమెరికాను తాకే శక్తి గల అణ్వాయిధ ప్రయోగ క్షిపణులను తయారు చేసే సత్తా ఆదేశానికి లేదన్నారు. సోమవారం సాయంత్రం ట్విట్టర్‌లో ట్రంప్ వ్యాఖ్యానించారు.
అమెరికాను లక్ష్యంగా చేసుకునే ఖండాంతర క్షిపణ తయారీ చివరి దశలో ఉందంటూ ఇటీవల ఉత్తరకొరియా నేత కిమ్ జంగ్ ఉన్ ప్రకటించారు. భవిష్యత్తులో బాధ్యతలు స్వీకరించే ట్రంప్‌పై ఒత్తిడి పెంచేందుకే కిమ్ ఈ ప్రకటన చేసినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ట్వీట్ చేయడం విశేషం. ట్రంప్ ఇప్పటివరకు ఉత్తరకొరియాపై ఎటువంటి విధానాన్ని ప్రకటించలేదు.
అమెరికా సైనిక శక్తిని పెంపొందించుకోవడంతో పాటు అణుశక్తిని కూడా పెంచుకుంటుందంటూ ట్వీట్ చేశారు. ఇంకోసారి చైనా సైనికశక్తి పెంచుకోవడాన్ని, కరెన్సీ విలును మార్చడాన్ని ట్రంప్ తప్పుపట్టారు. ఇప్పటికే ఒబామా సర్కారు ఉత్తరకొరియాను న్యూక్లియర్ దేశంగా గుర్తించేందుకు నిరాకరించింది. ఇటీవల అమెరికా పాలసీలకు సంబంధించిన విషయాలపై ట్రంప్ ఎక్కువగా ట్విట్టర్‌లో స్పందిస్తున్నారు.