వివరాల్లోకి వెళితే.. వాన్ అనే వ్యక్తికి కంటి నొప్పి బాగా రావడంతో ఆసుపత్రిలో చేరాడు. దీంతో అతనిని పరీక్షించిన వైద్యులు అతని కంటిలో నులిపురుగులు ఉన్నట్లు కనుగొన్నారు. మొదటిలో కంటినొప్పి వచ్చిందని, అయితే తాను అంతలా పట్టించుకోలేదని వాన్ తెలిపారు. తరువాత ఆ నొప్పి ఎక్కువ కావడంతో ఆసుపత్రికి వెళ్లినట్లు చెప్పారు.
అప్పటికే అతని కంటిలో 20 నులిపురుగులు ఉన్నట్టు గుర్తించిన వైద్యులు అతనికి చికిత్సనందించారు. సాధారణంగా ఇలాంటి పురుగులు కుక్కలు, పిల్లులు కన్నీటిలో ఉంటాయి. అయితే వాన్ ఇంట్లోకానీ పని చేసే చోట కానీ ఏలాంటి పెంపుడు జంతువులు లేవని వాన్ తెలిపారు. దీంతో అతని కంటిలోకి ఈ పురుగులు ఎలా చేరాయో తెలియరాలేదు.