కెనడాలో హైదరాబాదీ విద్యార్థి గుండెపోటుతో మృతి

సెల్వి

శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (13:50 IST)
Indian student
కెనడాలో హైదరాబాదీ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఆ విద్యార్థి వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కుమారుడి మరణవార్త విన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 
 
మృత దేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి సహాయం చేయాలని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన షేక్ ముజమ్మిల్ అహ్మద్ మాస్టర్స్ చదివేందుకు కెనడా వెళ్లాడు. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు అహ్మద్ ఫోన్‌లో చెప్పినట్లు అతని తల్లిదండ్రులు వివరించారు. 
 
జ్వరంతో బాధపడుతున్న అహ్మద్‌కు గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుమారుడి మృతితో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు.. మృతదేహాన్ని త్వరితగతిన హైదరాబాద్ తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు