26/11: దర్యాప్తుకు సమయం కోరిన పాకిస్థాన్

గత ఏడాది ముంబయి మహానగరంలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంలో నిషేధిత తీవ్రవాద సంస్థ జమాదుత్ దవా చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సయీద్ పాత్రను దర్యాప్తు చేసేందుకు తమకు సమయం కావాలని పాకిస్థాన్ ప్రభుత్వం కోరింది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఇటీవల పాక్ ప్రభుత్వం సయీద్‌పై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

దీనికి సంబంధించి నిర్బంధంలో ఉన్న సయీద్‌కు ముంబయి దాడులతో ప్రమేయాన్ని దర్యాప్తు జరిపేందుకు తమకు మరింత సమయం కావాలని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రెహమాన్ మాలిక్ తెలిపారు. భారత్ ఇప్పటివరకు ముంబయి దాడులకు సంబంధించి మూలాలు మాత్రమే పంపిందని, విశ్వసనీయమైన, చర్యలు తీసుకోదగ్గ ఆధారాలు పంపలేదని మాలిక్ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి