భారత్ పెయిన్స్ కిల్లర్స్ వాడుతున్న ఐఎస్ టెర్రరిస్టులు.. చిన్నపిల్లలకు ఆయుధాలిచ్చి.. ఈ మాత్రల్ని కూడా?

గురువారం, 11 మే 2017 (15:29 IST)
భారత్‌లో తయారయ్యే మాత్రలు ఐఎస్ ఉగ్రవాదులకు సరఫరా అవుతున్నాయట. భారత్‌లో తయారై.. లిబియాలోని ఐస్ టెర్రర్ మూకల కోసం 37 మిలియన్ల 'ట్రమడోల్' మాత్రలను ఇటలీ పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ మాత్రలను ఉగ్రవాదులు తమకు ఏర్పడిన గాయాల నుంచి కలిగే నొప్పిని తట్టుకునేందుకు విరివిగా వాడుతున్నట్లు బ్రిటన్ దినపత్రిక ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ మాత్రలు ఏ డ్రగ్ కంపెనీలో తయారయ్యాయని, ఎవరు బట్వాడా చేస్తున్నారనే విషయంలో ఇటలీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
భారత్‌లో తయారవుతున్న వీటిని ఓ దుబాయ్ దిగుమతి దారుడు ఆర్డర్ చేసుకుని.. శ్రీలంక మీదుగా తెప్పించుకున్నట్లు ఇటలీ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మాత్రలను ఐఎస్ టెర్రరిస్టులే కాకుండా నైజీరియా ఉగ్రవాద సంస్థ బోకో హరామ్ కూడా ఈ మాత్రలను అధికంగా వాడుతోందని ఇటలీ పోలీసులు తెలిపారు.

తమ వద్ద ఉన్న చిన్న పిల్లలకు ఆయుధాలు ఇచ్చి యుద్ధానికి పంపుతున్న బోకో హరామ్, వారికి ఈ మాత్రలను కూడా అందిస్తోంది. వీటితో పాటు ఆకలిని చంపే కాప్టాగాన్, ఆంఫిటామైన్ ఔషధాలను కూడా ఉగ్రవాద సంస్థలు వాడుతున్నాయని పోలీసులు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి