ఫ్రిడ్జ్ పేలడంతో ఐదుగురు సజీవదహనం-కంప్రెజర్ పేలిపోవడంతో..
సోమవారం, 9 అక్టోబరు 2023 (12:31 IST)
ఫ్రిడ్జ్ పేలడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనమైన ఘటన పంజాబ్‌లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్, జలంధర్ జిల్లాలో రిఫ్రిజిరేటర్ కంప్రెజర్ పేలిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది.
కంప్రెజర్ భారీ శబ్దంతో పేలిపోయిన తర్వాత.. ఇంటిలో మంటలు చెలరేగాయి. ఆ సమయానికి నిద్రపోతున్న బాధితులు.. ఆ మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు వున్నారు.
మృతులను యశ్‌పాల్ ఘయ్ (70), రుచి ఘయ్ (40), మన్షా (14), దియా (12), అక్షయ్ (10)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.