బాంబు పేలుళ్ళతో దద్దరిల్లిన బలూచిస్థాన్... పాక్ జవాన్లు మృతి

సోమవారం, 26 డిశెంబరు 2022 (09:17 IST)
పాకిస్థాన్ దేశంలోని బలూచిస్థాన్ ప్రావిన్స్ వరుస బాంబు పేలుళ్ళతో దద్ధరిల్లిపోయింది. బలుచిస్థాన్‌లోని లీడింగ్ పార్టీ సమీపంలో ఈ పేలుళ్లు సంభవించాయి. అలాగే, క్వెట్టాలో వేర్వేరు జోట్ల గ్రేనేడు దాడులు కూడా జరిగాయి. ఈ దాడుల్లో ఐదుగురు పాకిస్థాన్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది పౌరులు గాయపడ్డారు. 
 
ఈ నెల 24వ తేదీన నుంచి బలూచిస్థాన్‌లో పాక్ ఆర్మీ ఇంటెలిజెన్స్ క్లియరెన్స్ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో ఆదివారం శక్తిమంతమైన ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఈఐడీ) పేలింది. కోహ్లు జిల్లాలోని కహాన్ ప్రాంతంలో లీడింగ్ పార్టీ సమీపంలో పేలుడు సంభవించినట్టు పాకిస్థాన్ ఆర్మీని ఉటంకిస్తూ స్థానిక మీడియా వెల్లడించింది.
 
ఇదిలావుంటే, క్వెట్టాలోని శాటిలైట్ టౌన్‌లోని ఓ పోలీస్ చెక్ పోస్టుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గ్రనేడ్ దాడి చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురు పోలీసులు, ఐదుగురు పౌరులు ఉన్నారు. దేశం మొత్తం క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న వేళ ఈ దాడులు జరగడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు